Site icon NTV Telugu

Delhi Blast: ఢిల్లీ పేలుళ్లలో రెండవ మహిళా ఉగ్రవాది.. అఫిరా బీబీ ఎవరు?

Afira Bibi

Afira Bibi

Delhi Blast: చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలు. ఈ విభాగం మహిళలను మోసగించడంలో, వారిని తీవ్రవాద మార్గాలను అనుసరించేలా బలవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

READ ALSO: Chargers: ఛార్జర్లపై రాసిన ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా?..

పలు నివేదికల ప్రకారం.. ఢిల్లీ పేలుళ్లకు వారం ముందు ఈ విభాగంలో కొత్త సభ్యురాలిని చేర్చారు. ఆమె పేరు అఫిరా బీబీ. ఈ మహిళ 2019 పుల్వామా దాడిలో ఉగ్రవాద సూత్రధారులలో ఒకరి భార్య. ఆమెను బ్రిగేడ్ సలహా మండలిలో కూడా చేర్చారు. ఇక్కడ ఆమె ఉగ్రవాది మసూద్ అజార్ చెల్లెలు సాదియా అజార్‌తో కలిసి పని చేస్తుంది.

అసలు అఫిరా బీబీ ఎవరు..
పలు నివేదికల ప్రకారం.. అఫిరా బీబీ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ కమాండర్ ఉమర్ ఫరూఖ్ భార్య. ఫరూఖ్ పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారులలో ఒకరు. 2019లో డాచిగామ్ నేషనల్ పార్క్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతను మరణించాడు. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌పై పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కు దూసుకెళ్లి 40 మంది సైనికులను చంపిన విషయం తెలిసిందే. వాస్తవానికి అక్టోబర్ 8న మసూద్ అజార్ మహిళా బ్రిగేడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే క్రమంలో అక్టోబర్ 19న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని దుఖ్తరన్-ఎ-ఇస్లాంలో మహిళా సభ్యులను నియమించుకోవడానికి ఒక కార్యక్రమం జరిగింది. బ్రిగేడ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఆయన తన సోదరి సాదియాను నియమించాడు. ముస్లిం మహిళలలో తన భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే అజార్ ప్రణాళికలో సాదియా, అఫిరా బీబీ నియామకం ప్రధానమైనది.

ఢిల్లీ పేలుళ్లతో మహిళా బ్రిగేడ్ సంబంధం..
ఢిల్లీ బాంబు దాడుల కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టు తర్వాత ఈ బ్రిగేడ్ కార్యకలాపాలకు బలమైన ఆధారాలు బయటపడ్డాయని సమాచారం. భారతదేశంలో జమాత్-ఉన్-ముమినాత్ సభ్యురాలైన షాహీన్ షాహిద్ దేశంలో సంస్థ స్థానిక శాఖను స్థాపించే పనిని అప్పగించారు. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో i20 కారు పేలుడు జరిగి 12 మంది మృతి చెందగా, దాదాపు 24 మందికిపైగా గాయపడటానికి కొన్ని గంటల ముందు ఆమె కారులో ఒక అస్సాల్ట్ రైఫిల్, మందుగుండు సామగ్రి లభించింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

READ ALSO: RCB 2026 Venue: RCB హోమ్ గ్రౌండ్ మారుతుందా? కొత్త గ్రౌండ్ ఏదో తెలుసా!

Exit mobile version