NTV Telugu Site icon

Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు

Air Quality

Air Quality

Air Polution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా అవన్నీ కంటితుడుపుగానే కొనసాగుతున్నాయి. కారణం ప్రభుత్వాలు కాలుష్యం పెరుగుతోంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం కాలుష్యం విషయాన్ని పెడచెవిన పెడుతున్నారనడంతో సందేహం లేదు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచా కాల్పడంపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ నగరవాసులు ఆంక్షలను ఉల్లంఘించారు. దక్షిణ. వాయువ్య ఢిల్లీతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సంధ్యా సమయానికి క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. దీంతో దీపావళి రాత్రి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోయింది.

Read Also: Diwali Celebrations: భాగ్యనగరంలో దీపావళి సందడి.. టపాసుల మోతతో మారుమోగుతున్న నగరం

ఢిల్లీ, నోయిడాల్లో గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ స్థాయికి చేరుకుంది. అంతకుముందు.. సోమవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 301గా నమోదు కాగా.. దీపావళి అర్థరాత్రి వరకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఎయిర్ స్టాండర్డ్స్ ఏజెన్సీలు తెలిపాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) దీపావళికి ముందు రోజు (ఆదివారం) 259 గా నమోదైంది, ఇది ఏడేళ్ల కనిష్ట స్థాయి. ఆదివారం జరిగిన భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినందుకు ఆనందంతో ప్రజలు బాణాసంచా కాల్చారు. ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ క్రాకర్లు కాలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో దీపావళి రోజు రాత్రి బాణాసంచా కాల్చారు. అందువల్ల, గాలి నాణ్యత చాలా తీవ్రమైన వర్గానికి చేరుకుందని తెలిపారు. దీపావళి రోజున దేశ రాజధానిలో పటాకులు పేల్చితే ఆరు నెలల వరకు జైలు శిక్ష రూ.200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గత వారం తెలిపారు.

Read Also: Banana Peel: అరటి తొక్కే కదా అని తీసేస్తే.. ఈ నష్టాలు తప్పవు

ఏదేమైనప్పటికీ,ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం పడిపోయింది. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 312 గా నమోదు అయ్యిందనీ, ఏడేళ్లలో రెండోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని, 2018లో దీపావళి రోజున నగరం AQI 281గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మళ్లీ పటాకుల మోత పెరిగితే.. గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.