NTV Telugu Site icon

Delhi Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే వాయు కాలుష్యం.. మొదలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌!

Ban Vs Sl Match

Ban Vs Sl Match

BAN vs SL Match started in Delhi: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? అన్న అనుమాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రంగానే ఉన్నా.. మ్యాచ్ ఆరంభం అయింది. గాలి నాణ్యత సూచిక ఇప్పటికీ ఎక్కువగానే సూచిస్తున్నా.. సూర్యుడి రాకతో గత రెండు రోజులతో పోలిస్తే వాతావరణం మెరుగ్గా ఉందట. దాంతో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ పడింది.

బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. ముస్తాఫిజ్ స్థానంలో తాంజిమ్ షకీబ్ తుది జట్టులోకి వచ్చాడని తెలిపాడు. మరోవైపు రెండు బారులు చేసినట్లు శ్రీలంక సారథి కుసాల్ మెండిస్ పేర్కొన్నాడు. రుణరత్నే, హేమంత స్థానాల్లో కుశాల్ పెరీరా మరియు ధనంజయ వచ్చారు. ప్రపంచకప్‌ 2023 నుంచి బంగ్లా ఇప్పటికే నిష్క్రమించగా.. శ్రీలంక కూడా దాదాపుగా ఇంటికి వెళ్ళినట్లే.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటలకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 460గా నమోదైంది. అంటే ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. సోమవారం ఉదయం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణపై సోమవారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ తెలిపింది. వాయు కాలుష్యం ఉన్నా మ్యాచ్ మాత్రం మొదలైంది.

Also Read: Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్

తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.
బంగ్లాదేశ్‌: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం.

Show comments