NTV Telugu Site icon

Delhi: డానిష్ రాయబారి వీడియో వైరల్.. అందులో ఏముందంటే..?

Danesh

Danesh

భారతదేశంలోని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వెన్ మే 8న తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక వీడియోను పంచుకున్నారు. అది కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఎంబసీ భవనం వెలుపల చెత్త కుప్ప కనిపించింది. ఈ వీడియోలో, స్వెన్ తాను భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నానని, ఇక్కడ ఒక రహదారి చెత్తతో ఉందని చెప్పాడు. ఈ రహదారి ఢిల్లీలోని డెన్మార్క్ గ్రీస్ రాయబార కార్యాలయాల మధ్య ఉంది. ఆ విడియోలో డానిష్ దౌత్యవేత్త రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆయనకు కుడి వైపున డానిష్ రాయబార కార్యాలయం గోడ ఉంది. “మనోహరమైన మరియు పచ్చటి న్యూఢిల్లీకి స్వాగతం,” అని ఫ్రెడ్డీ స్వైన్ మాట్లాడుతూ.. చెత్తతో నిండిన వీధిని చూపించారు. “మాకు ఇక్కడ మా డానిష్ రాయబార కార్యాలయం ఉంది. మరొక వైపు గ్రీకు రాయబార కార్యాలయం ఉంది. ఈ ప్రాంతం మొత్తం చెత్తతో నిండి ఉంది. ప్రజలు ఇక్కడకు వచ్చి తమ మనసుకు నచ్చినది చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Aavesham: 150 కోట్ల ఫహాద్ ఫాజిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే?

దీనిపై ఎవరైనా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్వెన్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ ను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు. వీడియో కనిపించిన వెంటనే, న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC) స్పందించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసింది. దీని తరువాత, డానిష్ దౌత్యవేత్త చెత్తను తొలగించి శుభ్రం చేసినందుకు ఎన్ డీఎంసీ కి ధన్యవాదాలు తెలిపారు.