ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ్టి నుంచి జూన్ 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అటనామస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులు నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
Read Also: Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్
అలాగే ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అని ఏపీ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇక జూన్ 21 నుంచి 23 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగనుంది. ఆపై జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు వెబ్అప్షన్ల ప్రక్రియ ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న సీట్లను కేటాయిస్తారు. ఇక జూలై 4 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు సూచించారు.
Read Also: Delhi : ప్రాణం తీసిన పదివేలు.. అక్కాచెల్లెల్లు మృతి..
మరోవైపు ఏపీలో ఎండలు మండిపోతుండటంతో.. ముందుగా ప్రకటించిన ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 17వ తేదీ వరకు అదే విధంగా పాఠశాలలు కొనసాగాయి.. ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.
