NTV Telugu Site icon

GT vs MI: ముంబయి జోరు కొనసాగేనా?

Gt Vs Mi

Gt Vs Mi

GT vs MI: ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పంజాబ్‌పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకేందుకు ప్రయత్నించనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడడం గమనార్హం.

గుజరాత్, ముంబయి జట్లు రెండూ కూడా బలంగా ఉన్నాయి. కెప్టెన్‌ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ కేమెరూన్ గ్రీన్‌లు విజృంభిస్తే ముంబై ఇండియన్స్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. స్టార్ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్ రావడంతో జట్టుకు అదనపు బలం చేకూరింది. జోఫ్రా ఆర్చర్‌ పంజాబ్‌పై జరిగిన గత మ్యాచ్‌లో సామ్ కుర్రాన్‌ను అవుట్ చేసి ఈ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ఫిట్‌నెస్ సమస్యల కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతని రాకతో ముంబై బౌలింగ్‌ బలం పెరిగింది. వెటరన్‌ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా గొప్పగా రాణిస్తున్నాడు. ముంబై జట్టు గుజరాత్‌పై గెలిచి రెండు కీలక పాయింట్లను సాధించాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించి ఊపు మీదున్న గుజరాత్‌ జట్టు.. ముంబైపై గెలిచి పాయింట్ల పట్టికలో కీలక స్థాయికి చేరాలని ప్రయత్నిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌లకు అనుభవజ్ఞుడైన స్పీడ్‌స్టర్ హార్దిక్ పాండ్యా జట్టుకు కీలకమైన, సమయానుకూల పురోగతులను అందించడమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌తో ప్రభావం చూపుతున్నాడు. మరో బౌలర్ మోహిత్ శర్మ కూడా బాగా రాణిస్తుండడంతో గుజరాత్‌ జట్టు బలంగా కనిపిస్తోంది. లక్నోపై విజయం సాధించేందుకు, తన జట్టును గట్టెక్కించడానికి హార్దిక పాండ్యా 66 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు అతిపెద్ద సానుకూలాంశాలలో ఒకటి. ముంబైపై విజయం సాధించాలని గుజరాత్‌ పట్టుదలతో ఉంది. ఏ జట్టు గెలుస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గుజరాత్ జట్టు(అంచనా): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ

ముంబై జట్టు(అంచనా): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్

Show comments