Rajnath Singh: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. శ్రీనగర్‌లో నిర్వహించిన ‘శౌర్య దివస్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పీవోకేలో అరాచకాలు పెరిగాయని, వీటికి పాకిస్తాన్ ప్రతిఫలం అనుభవిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేర్చుకుంటేనే లద్దాఖ్, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి బుడ్గాంలో పర్యటించారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శౌర్య దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్.. దాయాది దేశం పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Petrol Diesel Price: రెండేళ్లలో చమురు ధరలు తగ్గుతాయ్ : ప్రపంచ బ్యాంక్
జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ లో అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలయ్యిందన్నారు రాజ్‌నాథ్. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకుంటే మన లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై పాకిస్థాన్ దురాగతాల గురించి ప్రస్తావిస్తూ, పొరుగు దేశం దాని పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారత దేశాన్ని టార్గెట్ చేయడమేనని చెప్పారు.
Read Also: అందాల సెగలు పుట్టిస్తోన్న టిల్లు భామ
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనిని రద్దు చేయడం వల్ల జమ్మూ-కశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు రాజ్‌నాథ్ సింగ్.
