Baz Drone: భారత సైన్యం స్వదేశీ ‘స్కై హంటర్’ డ్రోన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడనికి సిద్ధం అవుతుంది. ఈ డ్రోన్‌కు బాజ్ అని పేరు పెట్టారు. సైన్యం ఈ డ్రోన్‌కు సంబంధించిన మొత్తం సాంకేతికతను (టెక్నాలజీ బదిలీ – ToT) భారతీయ ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసింది. ఈ డ్రోన్లను ఇప్పుడు పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు. ఇవి త్వరలోనే సైన్యంలోకి రాబోతున్నాయి. ఈ సూపర్ డ్రోన్‌ను కల్నల్ వికాస్ చతుర్వేది స్వయంగా రూపొందించారు. సైనిక అనుభవాన్ని, ప్రైవేట్ కంపెనీల చురుకుదనంతో కలిపినప్పుడు స్వదేశీ సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇది చూపిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
READ ALSO: TPCC Mahesh Goud : కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరుకు కార్పొరేషన్ చైర్మన్లు..
బాజ్ డ్రోన్ ప్రత్యేకతలు
* ఇది దూరం నుంచే శత్రు ట్యాంకులు, బంకర్లు, ఆయుధ డిపోలను పేల్చివేయగలదు.
* రాకెట్లు, గ్రెనేడ్లు, చిన్న క్షిపణులు – వివిధ రకాల ఆయుధాలను మోయగలదు.
*గూఢచర్యం, నిఘా, శత్రు భూభాగంలో వస్తువులను పంపిణీ చేయడం.
*ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఎందులో ఈ రికార్డ్‌ను సొంతం చేసుకుంది అంటే.. ఈ డ్రోన్ గాల్లో ఉన్నప్పుడు లాంచర్ నుంచి రాకెట్లను పేల్చ సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది.
*ఈ డ్రోన్ నేరుగా కెమెరా వైపు గురిపెట్టి కచ్చితంగా దాడి చేసి, ఆపై సురక్షితంగా తిరిగి రాగలదు.
* ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తితో దానంతట అదే బయలుదేరుతుంది. ముందుగా నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తుంది. అవసరమైతే మాన్యువల్ నియంత్రణను కూడా పొందగలదు.
రాకెట్-ఫైరింగ్ డ్రోన్
* ఇప్పటివరకు ప్రపంచంలో డ్రోన్లు చిన్న బాంబులు లేదా గ్రెనేడ్లను మాత్రమే జారవిడిచాయి. కానీ భారత్ బాజ్ అనేది పూర్తి రాకెట్ లాంచర్ (RPG లేదా యాంటీ ట్యాంక్ రాకెట్ వంటివి)ను మోసుకెళ్లి గాలి నుంచి పెల్చగల మొదటి డ్రోన్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇది ట్యాంకులు, సాయుధ వాహనాలు లేదా బంకర్లను దూరం నుంచి నాశనం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది.
* ప్రైవేట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ‘బాజ్’ను తయారు చేయనున్నాయి.
* ఈ డ్రోన్లు 2026-27 నుంచి ఆర్మీ రెజిమెంట్లలోకి అందుబాటులోకి రానున్నాయి.
* ఒక స్క్వాడ్రన్‌లో 20-30 డ్రోన్‌లు ఉంటాయి.
* వీటితో సరిహద్దులో మోహరించిన సైనికులు తక్షణ బలాన్ని పొందుతారు.
* ఈ డ్రోన్ల ఎగుమతి చేసుకోడానికి చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఈ డ్రోన్ సామర్థ్యంపై ఆరా తీస్తున్నాయి.
బాజ్ అనేది కేవలం డ్రోన్ మాత్రమే కాదని, ఇది భవిష్యత్తు ఆయుధమని ఒక సీనియర్ ఆర్మీ అధికారి వివరించారు. ఇది 5-10 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు ట్యాంకులను నాశనం చేయగలదని వెల్లడించారు. దీని రాకతో సైనికులు సురక్షితంగా ఉంటారని, అలాగే శత్రు ట్యాంకులపై దాడి ఎక్కడి నుంచి జరిగిందో శత్రువులకు కూడా తెలియదని చెప్పారు. ఈ సందర్భంగా కల్నల్ వికాస్ చతుర్వేది మాట్లాడుతూ.. సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల కోసం దీనిని రూపొందించామని వెల్లడించారు. ఇప్పుడు ఈ డ్రోన్ వారికి రక్షణ కవచంగా, శత్రువుల శరీరాలను తెగ నరికే కత్తిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశం ఇకపై డ్రోన్‌లను కొనుగోలు చేయదని, ప్రపంచాన్ని భయపెట్టే డ్రోన్‌లను తయారు చేస్తుందని బాజ్ నిరూపించిందని వెల్లడించారు.
READ ALSO: Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
