NTV Telugu Site icon

Deepika Padukone : దీపికా కండిషన్స్ కి బిత్తరపోయిన శింబు… మరో మాట లేకుండానే..

Deepika Padukone, Simbu

Deepika Padukone, Simbu

Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు. తమిళనాట శింబుకి రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఉంది. శింబు నటించిన ఆఖరి చిత్రం ‘పత్తుతల’ తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో శింబు తన 48వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి పెరియసామి దర్శకుడు. శింబు కెరీర్లోనే క్రేజీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.

Read Also: Aishwarya Rajesh: నేను రష్మికని ఏమీ అనలేదురా బాబు…

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రంలో శింబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం అయింది. చిత్ర యూనిట్ తనను సంప్రదించినప్పుడు ఆమె మేకర్స్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె డిమాండ్లకు శింబు, చిత్రబృందానికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. ఈ చిత్రంలో నటించేందుకు దీపికా పదుకొనె ఏకంగా రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు ఆమె విప్పిన ఖర్చుల చిట్టా చూసి అంతా కంగుతిన్నారు. లగ్జరీ హోటల్ లోనే ఆమెకు బస ఏర్పాటు చేయాలట. షూటింగ్ జరిగినన్ని రోజులు హోటల్ లో ఫ్లోర్ మొత్తం తనకే బుక్ చేయాలనీ కోరిందట. ఇక ట్రావెల్ ఖర్చులు, ఆమె సిబ్బంది ఖర్చులు ఎలాగు ఉన్నాయి. దీంతో ఈ రేంజ్ ఖర్చులు భరించలేం అని దీపికా పదుకొనెని ఎంపిక చేసుకునే ఆలోచన శింబు చిత్ర యూనిట్ విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read Also:CM YS Jagan: టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..