Deepika Padukone: రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ నటులు, స్టార్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ.. రణవీర్ భార్య, ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్‌గా మారాయి. దీపికా స్పందించకపోవడానికి గల కారణం ఏంటి? అని రచ్చ రచ్చ చోటు చేసుకుంది. తన భర్త సినిమా విజయాన్ని ఆమె ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదని, ఇది కావాలని చేస్తున్నారా? లేక మనం అతిగా ఆలోచిస్తున్నామా? అనే కోణంలో సోషల్ మీడియాలో పోల్స్ నిర్వహించారు. అయితే.. తాజాగా దీపికా ఈ అంశంపై స్పందించింది. తనదైన స్టైల్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద ఆమె కామెంట్ చేసింది. “మీ అందరి కంటే ముందే నేను ఈ సినిమా చూశాను.. మరి ఇప్పుడు ఈ జోక్ ఎవరి మీద?” అంటూ చురకలు అంటించింది. కేవలం సోషల్ మీడియా పోస్టులే ఒకరి సపోర్ట్‌కు నిదర్శనం కాదనే విషయాన్ని ఆమె తన సమాధానంతో స్పష్టం చేసింది.
READ MORE: Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
అయితే.. ‘ధురందర్’ సినిమాపై దీపికా గతంలో ప్రశంసలు కురిపిచింది. 2025 డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలైన సమయంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసి.. దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు చిత్ర బృందాన్ని అభినందించింది. ఈ సినిమాను తప్పక చూడాలని ప్రేక్షకులను కోరింది. అంతేకాకుండా, ఇటీవల తన పుట్టినరోజు వేడుకలకు ముందు నిర్వహించిన ఫ్యాన్ మీట్‌లోనూ ‘ధురందర్’ భారీ విజయం సాధించడం పట్ల ఎంతో గర్వంగా మాట్లాడింది. అక్కడ ఉన్న ప్రేక్షకులందరినీ సినిమా చూశారా? అని అడిగింది. వారి నుంచి సానుకూల స్పందన రావడం చూసి దీపికా ఎంతో సంబురపడింది. ఈ పరిణామాలను చూస్తూ సోషల్ మీడియాలో దీపికా పదుకొనేపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమైంది.
