Site icon NTV Telugu

Deepika Padukone : యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దీపికా పదుకొణె..

Deepika Padukune

Deepika Padukune

సినిమాల్లో ఛాన్స్ కొట్టాలని, తెరవెనుక ఉండి మ్యాజిక్ చేయాలని చాలామంది యూత్ కలలు కంటుంటారు. అలాంటి వారి కోసం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. తన 40వ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్’ (The Onset Program) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. చదువు అయిపోయి ఖాళీగా ఉన్నవారు లేదా సినీ రంగంలో టాలెంట్ చూపించాలనుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Also Read : Atlee – Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ మూవీ: మరో క్రేజీ గెస్ట్ రోల్ ప్లాన్ చేసిన అట్లీ!

ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? మనలో చాలామందికి కథలు రాయడం, కెమెరా తిప్పడం, డైరెక్షన్ చేయడం లేదా మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విభాగాల్లో మంచి పట్టు ఉంటుంది. కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసం దీపికా ఈ వేదికను క్రియేట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ టాలెంట్‌ను గుర్తించి, వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని గతేడాదే అనుకున్నాను.. ఇప్పుడు దాన్ని నిజం చేస్తున్నాను’ అంటూ దీపికా ఒక వీడియో ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది. మీరు కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే.. వెంటనే ‘onsetprogram.in’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలు, మీరు చేసే పనికి సంబంధించిన శాంపిల్స్‌ను అక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పని నచ్చితే, ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద టెక్నీషియన్ తో కలిసి పని చేసే అవకాశం మీకు దక్కుతుంది. నటన ఒక్కటే కాదు.. రైటింగ్, ప్రొడక్షన్, కెమెరా ఇలా అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తారు. సో, ఇంకెందుకు ఆలస్యం.. మీలో టాలెంట్ ఉంటే వెంటనే ట్రై చేయండి.

Exit mobile version