Deepika Padukone about Prabhas Home Food: అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27న రిలీజ్ కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ బుధవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్ అశ్విన్, అశ్వనీ దత్ తదితరులు పాల్గొన్నారు. ప్రెగ్నెంట్ అయినా కూడా దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తక్కువ సమయే జరిగినప్పటికీ.. నటీనటులు చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి.
Also Read: IND vs AFG: నేడు సూపర్-8లో భారత్ తొలి మ్యాచ్.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు
బేబి బంప్‌తో ఉన్న దీపికా పదుకొణె.. కల్కి 2898 ఏడీ షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తన బేబి బంప్‌పై దీపికా ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ తెచ్చిన ఫుడ్ వల్లే తనకు పొట్ట వచ్చిందని సరాదా కామెంట్స్ చేశారు. ‘నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్. ప్రభాస్ ఇంటి భోజనమే నా బేబి బంప్‌కి కారణం. షూటింగ్ సమయంలో ప్రతిరోజు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్‌లా ఉండేది. ప్రభాస్ ఇంటి నుంచి ఈరోజు ఏ స్పెషల్ ఫుడ్ వస్తుందా? అని ఎగ్జైట్‌మెంట్‌గా ఉండేది’ అని దీపికా చెప్పారు.