NTV Telugu Site icon

AP Rains : హమ్మయ్యా..! తగ్గుముఖం పట్టిన వర్షాలు..

Ap Weather

Ap Weather

గత కొన్ని రోజుల నుంచి విస్తారంగా కురిసిన భారీ వర్షాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురవడం వల్ల పెద్దగా నష్టాలేమీ సంభవించలేదు. అధికార యంత్రాంగం ఎప్పటి కప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. వాతావరణం పొడిగా మారి ఎండ పొరలు రావడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో నదీపరివాహక మండలాల ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుండి ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఒకటి , రెండు రోజుల్లో గోదావరి వరద నీటిమట్టం పెరగవచ్చునని ఇరిగేషన్. అధికారులు అంచనా వేస్తున్నారు.

Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

Show comments