NTV Telugu Site icon

Vasavi Matha: శరన్నవరాత్రి ఉత్సవాలలో రూ.6,66,66,666తో వాసవీ కన్యకాపరమేశ్వరి అలంకరణ

Vasavi Matha

Vasavi Matha

Vasavi Matha: మహబూబ్ నగర్ లోని పాలమూరు బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ అర్యవైశ్య సంఘం అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారును మహాలక్ష్మీ దేవి రూపంలో రూ.6,66,66,666.66 పైసల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవాలయ అలంకరణ అమ్మవారి అలంకారం చేసారు. హైందవ బంధువులందరూ అమ్మ వారి భక్తాదులందరూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తరించగలరని మహబూబ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు, కార్యదర్శి మిరియాల వేణుగోపాల్, కోశాధికారి తల్లం నాగరాజు ఆహ్వానం పలికారు.

Kid Assaults: అమానుషం.. తన కుక్కను అనుకరించినందుకు 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)

దేవాలయానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి సన్నిధిలో ఉంచి లక్ష్మీ పూజ చేసిన కాయిన్ (రూపాయి బిళ్ళ) అందరికీ ప్రసాదంగా ఇవ్వబడుతుందన్నారు. ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహా లక్ష్మి రూపంలో 6 కోట్ల 66 లక్షల 66, వేల 666 రూపాయల 66 పైసలచే అలంకరణను తమిళనాడు నుండి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని అలంకరించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ అన్నదానము చేస్తున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.