Site icon NTV Telugu

Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. ప్రకటించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

Dk Shivakumar

Dk Shivakumar

కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణను చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పూర్తైంది. అయితే కర్ణాటకలో మాత్రం కులగణన సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు.

Also Read:Honeymoon Murder: భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..?

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కొత్త కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈరోజు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలిపారు.

Exit mobile version