NTV Telugu Site icon

Facebook Fraud: ఆన్‌లైన్‌ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!

Face Book Froud

Face Book Froud

Facebook Fraud: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది స్కామర్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ కాల్స్, లింక్‌లు మొదలైనవి డబ్బుకోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిని టార్గెట్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. విచిత్రమేమిటంటే మోసాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు పొందాలనే అత్యాశతో ఉన్నారు. తాజాగా ఇద్దరు స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటనను నమ్మి రూ. 1.60 లక్షలు మోసపోయారు. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసుకులకు ఆశ్రయించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: RSS: “నో డ్రోన్” జోన్‌గా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం..

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారే పల్లితండాకు చెందిన బి.ప్రవీణ్ కుమార్, మన్సాన్పల్లి తండాకు చెందిన శ్రీనులు స్నేహితులు కలిసి వ్యాపారం చేసేందుకు నెల రోజుల పాటు డీజే కొన్నారు. కానీ డీజేకి జనరేటర్ అవసరం కావడంతో ఆన్‌లైన్‌లో వెతికారు. ఈ క్రమంలో రూ.1.90 లక్షలకు జనరేటర్ దొరుకుతుందంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చూశారు. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కి కాల్ చేశారు. పుణెకు చెందిన మనీష్ రమాకాంత్ దుర్వే జనరేటర్ కోసం రూ.1.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ. 5 వేలు, ఆపై రూ. 10 వేలు, రూ. 20 వేలు, ఇలా మొత్తం అతని ఖాతాలో రూ.1.60 లక్షలు జమ అయ్యాయి. ప్రైవేట్ వాహనంలో జనరేటర్ పంపిస్తున్నట్లు రెండు ఫొటోలు పంపి వారిని నమ్మించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి జనరేటర్ రాకపోవడంతో ప్రవీణ్, శ్రీనులకు అనుమానం వచ్చింది. మనీష్ రమాకాంత్ దుర్వే చెప్పిన అడ్రస్ కు పూణేలో తెలిసిన వాళ్లను పంపించారు.. అక్కడ అసలు దుకాణమే లేదని ప్రెండ్స్ చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Congress Free Scooty: యువతులకు ఫ్రీ స్కూటీ స్కీమ్.. అప్లై ఎలా చేయాలంటే..!