Site icon NTV Telugu

Mysterious Disease: కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి

Congo

Congo

ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి.

Read Also: BJP: ‘‘హిందీ వద్దు, ఉర్దూ ముద్దా..?’’ స్టాలిన్‌పై బీజేపీ ఫైర్..

వ్యాధి లక్షణాలు:
కాంగోలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రోగుల్లో లక్షణాలు కనిపించిన తర్వాత చాలా మంది 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు రోగిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్) ఉంటాయి. ఈ కారణంగా.. ఈ వ్యాధి చాలా డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్నరల్ బ్లీడింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. రక్తస్రావం జ్వరం ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వైరస్ తో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు అందుకున్న డజనుకు పైగా నమూనాల పరీక్షల నుండి పరిశోధకులు ఈ వ్యాధికి ఈ వైరస్‌లతో ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు.

Read Also: ICC ODI Rankings: ఐసీసీ ర్యాక్సింగ్‌లో టీమిండియా హవా.. టాప్-10లో నలుగురు మనళ్లే

కాగా.. ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు 2025 జనవరి 21న కాంగోలో నమోదైంది. అప్పటి నుండి ఇప్పటివరకు 419 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 53 మంది మరణించారు. కాంగోలో వ్యాపిస్తున్న ఈ మర్మమైన వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికా కార్యాలయం మాట్లాడుతూ.. బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలాలు తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందని తెలిపింది. దాని కారణంగా వారు 48 గంటల్లోనే మరణించారు. అంతకుముందు, కాంగోలోని మరొక ప్రాంతంలో మరో వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. అయితే.. ఆ వ్యాధి మలేరియాగా గుర్తించారు. 400 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 79 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. ఆఫ్రికన్ దేశాలలో ఇటువంటి మర్మమైన వ్యాధులు వ్యాప్తి చెందడం సర్వసాధారణమే..

Exit mobile version