NTV Telugu Site icon

Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన 20నిమిషాల్లోనే పశ్చిమ నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన పోఖారాలో ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72మంది చనిపోయారు. అందులో నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కుప్పకూలిన విమానం కో-పైలట్ అంజు ఖతివాడ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. ఈమె తన మొదటి భర్తలాగే ప్రమాదంలో కన్నుమూసింది. అంజు మొదటి భర్త దీపక్ పోఖరేల్ కూడా యతి ఎయిర్‌లైన్స్‌లో పైలట్. దీపక్ ప్రయాణించిన విమానం జూన్ 21, 2006న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దీపక్ సహా పది మంది మరణించారు.

Read Also: Plane Accident: నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్ బుక్‎లో లైవ్ స్ట్రీమింగ్

దీపక్ మరణం తర్వాత అంజు మళ్లీ పెళ్లి చేసుకుంది. పైలట్‌గానే కొనసాగాలని నిర్ణయించుకుంది. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించిన అంజు.. నేపాల్‌లోని అత్యంత కష్టతరమైన విమానాశ్రయాల్లో విజయవంతంగా దిగి.. కెప్టెన్‌గా ర్యాంక్‌కు చేరువలో ఉంది. ఆదివారం కనుక ఆ విమానం విజయవంతంగా ల్యాండ్ అయితే ఆమెకు ఫైలట్ గా ప్రమోషన్ వచ్చేది. ఇది ఆమె కల. తాను అనుకున్న కల నెరవేరకుండానే ప్రాణాలు పోగొట్టుకుంది. ప్రమాదం జరిగినప్పుడు అంజు కెప్టెన్ కమల్ తో కో-పైలట్‌గా ఉంది. దీపక్‌- అంజు దంపతులకు 22 ఏళ్ల కుమార్తె ఉంది. దీపక్ మరణం తర్వాత రెండో పెళ్లిలో ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అంజు తల్లిదండ్రులు ప్రస్తుతం బిరత్ నగర్‌లో నివసిస్తున్నారు.

విమాన ప్రయాణ భద్రత విషయంలో నేపాల్ అధ్వాన్నమైన దేశం. అవన్నీ పాత విమానాలు కావడం విమాన సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడమే ప్రధాన సమస్య. నిన్న కూలిన విమానాన్ని పదిహేనేళ్ల కింద తయారు చేశారు. దీనిని 2012 వరకు భారతదేశంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉపయోగించింది. తర్వాత దీనిని థాయ్‌లాండ్‌లోని ఒక విమానయాన సంస్థ కొనుగోలు చేసి ఉపయోగించింది. 2019లో యతి ఎయిర్‌లైన్స్… వారి నుంచి ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. మెయింటెనెన్స్ నిమిత్తం కొన్ని రోజులు విమానాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అయితే విమానం కూలినప్పుడు ఏదైనా మెకానికల్ లోపం ఏర్పడిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.

Read Also:Nepal PM India Tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్‌ ప్రధాని!

అంతే కాకుండా.. ఈ సంఘ‌ట‌న‌లో నేపాల్ ప్రముఖ జాన‌ప‌ద గాయ‌ని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చ‌నిపోయింద‌నే విష‌యాన్ని ఆమె సోద‌రి హీరా ఛాంత్యల్ షెర్చాన్ ధ్రువీక‌రించింది. పోఖార‌కు విమానంలో బ‌య‌లుదేరిన నీరా మ‌ర‌ణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సంద‌ర్భంగా పోఖార‌లో నిర్వహిస్తున్న ఒక ఈవెంట్‌లో పాల్గొన‌డం కోసం వెళ్లింది.