Site icon NTV Telugu

Hawaii Wildfires: హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం

Hawaii Wildfires

Hawaii Wildfires

Hawaii Wildfires: అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. కార్చిచ్చుతో వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. సుమారు 2200 పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు నివారణలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శవాల కోసం శవ కుక్కలతో రికవరీ సిబ్బంది వందలాది గృహాలల్లో పరిశీలన చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లహైనాలో వాహనాలను తగలబడటం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read also:Hardik vs Pooran Challenge: దమ్ముంటే నా బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టంటూ సవాల్.. హార్దిక్ దూల తీర్చిన విండీస్ హిట్టర్ పూరన్!

మౌయి ద్వీపంలోని చారిత్రక తీర పట్టణం బుధవారం తెల్లవారుజామున కార్చిచ్చులో తగులబడి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. కార్చిచ్చు సమయంలో ద్వీపంలోని సైరన్‌లు ఏవీ ఎందుకు యాక్టివేట్ చేయలేదని మీడియా ప్రశ్నించగా.. హవాయి సెనేటర్ మజీ హిరోనో రాష్ట్ర అటార్నీ జనరల్ ప్రకటించిన దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తాన్నమని చెప్పారు. జరిగిన విషాదానికి నేను ఎటువంటి సాకులు చెప్పబోనని డెమొక్రాట్ అయిన హిరోనో మీడియాకు చెప్పారు. రెస్క్యూ పనులు ఇంకా వేగంగా నిర్వహించడంపై, మృతదేహాలను వెతకడంలో దృష్టి సారించినట్టు తెలిపారు. లాహైనాలో మంటలు చెలరేగడంతో 2,200 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అధికారిక అంచనాల ప్రకారం 5.5 బిలియన్ల అమెరికా డాలర్ల నష్టం వాటిల్లిందని.. కార్చిచ్చు మూలంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ కుక్కలతో ఇప్పటికీ వందలాది మంది వ్యక్తుల కోసం వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పెల్లెటియర్ చెప్పారు. వీలయినంత వేగంగా పరిశోధిస్తున్నట్టు చెప్పారు. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్‌లలో 453 మంది మరణించిన తర్వాత 1918 నుండి అమెరికాలో ఇప్పుడు సంభవించిన కార్చి్చ్చే అత్యంత ఘోరమైనదని తెలిపారు. 2018లో కాలిఫోర్నియాలోని క్యాంప్ ఫైర్‌ను అధిగమించిందని.. చిన్న పట్టణమైన ప్యారడైజ్‌ను తుడిచిపెట్టిందని.. ఆ ప్రమాదంలో 86 మంది మరణించారని తెలిపారు. ద్వీపాలు సునామీలు, భూకంపాలు మరియు హింసాత్మక తుఫానుల వంటి సహజ విపత్తులకు గురైనప్పటికీ, విపత్తు కోసం అధికారులు ఎలా సన్నద్ధమయ్యారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు.

Exit mobile version