NTV Telugu Site icon

Saudi: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మంది మృత్యువాత(వీడియో)

Maxresdefault (13)

Maxresdefault (13)

ఈ ఏడాది హజ్ యాత్రలో అనారోగ్యం, గరిష్ట ఉష్ణోగ్రతలు తదితర కారణాల వల్ల సుమారు 1300 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో ఈసారి హజ్యాత్రకు భక్తులు తరలివచ్చారు. గతేడాది 16 లక్షల మంది వస్తే ఈ ఏడాది 18 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడం తో 50 డిగ్రీలపైగ ఎండలు హజ్ యాత్రికులకు శాపంగ మారింది మరణించిన ప్రతి 5 మందిలో 4 మంది అనధికారికంగా ఇక్కడికి వచ్చారు. వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. వారికి మార్గనిర్దేశం చేసేవారు లేరు. భారీ ఎండలో కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. అనధికారికంగా ఇక్కడికి రావడంతో వారికి సరైన సౌకర్యాలు లేక ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు చెప్పారు.
YouTube video player