NTV Telugu Site icon

Sushant Singh Rajput: “నాలుగేళ్లయినా..మరణం మిస్టరీగానే మిగిలింది.”..భావోద్వేగానికి లోనైన సుశాంత్ సింగ్ సోదరి

New Project (1)

New Project (1)

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)వ‌ర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయ‌న ముంబై లో త‌న ఇంట్లో ఉరి వేసుకుని చ‌నిపోయారు. హీరోగా రాణిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న త‌రుణంలో 34 ఏళ్ల సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం అంద‌రినీ ఆశ‌ర్చప‌రిచింది. ఆయ‌న మ‌న‌కు దూర‌మై నాలుగేళ్లు అవుతుంది. అయితే సుశాంత్ (Sushant) ఆత‌హ‌త్య చేసుకోలేద‌ని, చంప‌బ‌డ్డారంటూ ఆయ‌న‌ మ‌ర‌ణంపై ఆయ‌న అభిమానులు, వీడియా, ప్ర‌జ‌లు చాలా అనుమానాల‌నే వ్యక్తం చేశారు. కంగ‌నా రనౌత్ వంటి వ్యక్తులైతే బ‌హిరంగంగా నెపోటిజంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. సినీ ఇండ‌స్ట్రీకి సంబంధం లేకుండా వ‌చ్చి హీరోగా ఎదుగుతున్న వ్యక్తిని ఎద‌గ‌నీయ‌కుండా చేశారని, అవ‌కాశాలు రానీయ‌కుండా అడ్డుప‌డ్డార‌ని.. దాంతోనే ఆయ‌న డిప్రెష‌న్‌కి లోనై ఆత్మహ‌త్య చేసుకున్నార‌నే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఆయన సోదరి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

READ MORE: Dolly Chaiwala: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన డాలీ చాయ్‌వాలా.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)

దివంగత నటుడి సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా త్రోబాక్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సుశాంత్ సింగ్ తన సోదరీమణులతో సరదాగా గడిపాడు. క్యాప్షన్‌లో శ్వేత “భాయ్, మీరు మమ్మల్ని విడిచిపెట్టి 4 సంవత్సరాలు అయ్యింది. జూన్ 14, 2020న ఏం జరిగిందో మాకు ఇంకా తెలియదు. మీ మరణం మిస్టరీగా మిగిలిపోయింది. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. నిజం కోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను వేడుకున్నాను. నేను నా సహనాన్ని కోల్పోతున్నాను. వదులుకోవాలని భావిస్తున్నాను. అయితే చివరి సారిగా.. ఈ కేసులో సహాయం చేయగల ప్రతి ఒక్కరినీ మీ గుండెల మీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని కోరుతున్నాను. మా సోదరుడు సుశాంత్‌కు ఏమి జరిగిందో తెలుసుకునే అర్హత మాకు లేదా? ఇది రాజకీయ ఎజెండాగా ఎందుకు మారింది? ఆ రోజు ఏం దొరికింది.. ఏమి జరిగిందో సూటిగా ఎందుకు చెప్పడం లేదు? దయచేసి, నేను అభ్యర్థిస్తున్నాను..వేడుకుంటున్నాను. మనం కుటుంబంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి.” ఇలా రాసుకొచ్చింది.

Show comments