Hawaii Wildfire: అమెరికాలో హవాయి ద్వీపంలో ఏర్పడిన భీకర కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మౌయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వేల ఇళ్లు అగ్నికి బూడిదయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికి గాలులు తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. లహైనా రిసార్టు నగరంలో ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్చిచ్చుకు ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు.
Also Read: RMP Doctors: ఆర్‌ఎంపీ డాక్టర్లు ఫార్మా కంపెనీలతో సంబంధాలు పెట్టుకోరాదు.. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు
ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు రోడ్లను మూసివేశారు. 1960లో 61 మందిని బలిగొన్న సునామీని అధిగమించిన ఈ అడవి మంటలు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. 1946లో సంభవించిన ఘోరమైన సునామీ కారణంగా 150 మందికి పైగా మరణించారు.
Also Read: Tomato price: టమోటా ధర ఢమాల్.. అక్కడ కిలో టమోటా రూ.30..
సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గవర్నర్ జోష్ గ్రీన్ హెచ్చరించారు. లాహైనా నివాసితులు వారి ఆస్తులను తనిఖీ చేయడానికి శుక్రవారం తిరిగి రావడానికి అనుమతించబడతారని, ప్రజలు నీటిని పొందడానికి, ఇతర సేవలను పొందేందుకు కూడా బయటకు వెళ్లగలరని కూడా ఆయన చెప్పారు. శనివారం ఉదయం 6 గంటల వరకు అధికారులు కర్ఫ్యూ విధించారు. వందలాది పైపులు పాడైపోయినందున తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రజలు నీటిని మరిగించిన తర్వాత కూడా తాగకూడదని మౌయ్ కౌంటీ వాటర్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ స్టఫుల్‌బీన్ తెలిపారు.