Site icon NTV Telugu

Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు నరకయాతన..!

Ggh

Ggh

Kurnool GGH: కర్నూలు జీజీహెచ్‌ ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్ లో ఓ ఐదేళ్ల బాలుడు నరకయాతన చూశాడు.. రోజంతా ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఆ ఐదేళ్ల బాలుడు.. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్‌ థియేటర్‌ లోపలే ఉండిపోయాడు మూగ, చెవిటి బాలుడు.. రోజంతా ఆకలితో అలమటీంచిపోయాడు.. అయితే, ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు.. రోజు వెళ్లదీశాడు.. చికిత్స కోసం అసుపత్రికి వచ్చాడు ఓర్వకల్ మండలం తిప్పాయిపల్లె కు చెందిన బాలుడు.. అయితే, ఆపరేషన్‌ థియేటర్‌ ఉన్న గదిని శుభ్రం చేయడానికి ఆదివారం సిబ్బంది తలుపులు తెరిచిన సమయంలో ఈ మూగ, చెవిటి బాలుడు లోపలికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అది గమనించని సిబ్బంది.. వారి పనిముగిసిన తర్వాత.. యథావిథిగా ఆపరేషన్‌ థియేటర్‌ తలుపులు మూసివేశారు.. దీంతో.. రోజంతా అందులోనే నరకయాతన చూశాడు ఆ బాలుడు.. మరుసటి రోజు ఆపరేషన్ థియేటర్ తలుపులు తీయడంతో బాలుడు కనిపించగా కంగుతిన్నారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు.

Read Also: SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి

Exit mobile version