NTV Telugu Site icon

Brazil Floods: బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 36 మంది మృతి

Brazil Floods

Brazil Floods

Brazil Floods: ఆకస్మిక వరదలు బ్రెజిల్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇప్పటికే ఈ వరదల దాటికి 36మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పౌలో రాష్ట్రంలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. దీంతో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. 36 మంది చనిపోగా డజన్ల సంఖ్యలో జనం గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సావో సెబాస్టియావో పట్టణం నుండి టీవీ, సోషల్ మీడియా ఫుటేజీలు వరదలతో నిండిన రహదారులు, కార్లు పడిపోయిన చెట్లను చూపించాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: Brinjal Benefits: నచ్చలేదని వంకాయకు వంకపెట్టారో.. మీరు అన్నీ మిస్సయినట్లే

సావో పాలో నగరానికి ఉత్తరాన ఉన్న తీర ప్రాంతంలో మరో 228 మంది నిరాశ్రయులవగా, 338 మందిని ఖాళీ చేయించారు. తుఫాను బారిన పడిన వారికి సహాయం చేయడానికి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ వాతావరణం కారణంగా దెబ్బతిన్న తీరం వెంబడి ఉన్న ఐదు పట్టణాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అతను రెస్క్యూ ఆపరేషన్ల కోసం 1.5 మిలియన్ డాలర్ల నగదును కేటాయించారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు.

Read Also:Vishnu Kumar Raju: కన్నాను కలిసిన విష్ణుకుమార్‌ రాజు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

మ‌ట్టి గుట్టల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయ‌త్నాలు సాగుతున్నాయి. వ‌ర‌ద‌ల వ‌ల్ల అనేక న‌గ‌రాల్లో కార్నివాల్ వేడుక‌ల్ని ర‌ద్దు చేశారు. సావో సెబాస్టియోలో గ‌త 24 గంట‌ల్లో 627 మిమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆ న‌గ‌ర మేయ‌ర్ తెలిపారు. 50 ఇండ్లకుపైగా వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన‌ట్లు చెప్పారు. సాంటోస్ న‌గ‌రంలో ఉన్న పోర్టును మూసివేశారు. బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో పోర్టును బంద్ చేస్తున్నట్లు ప్రక‌టించారు. అనేక ప్రాంతాల్లో ఇంకా భారీ వ‌ర్షాలు ఉండ‌నున్నట్లు వెద‌ర్ శాఖ తెలిపింది.