Brazil Floods: బ్రెజిల్లో వరద బీభత్సం.. 36 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Floods: ఆకస్మిక వరదలు బ్రెజిల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇప్పటికే ఈ వరదల దాటికి 36మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పౌలో రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. 36 మంది చనిపోగా డజన్ల సంఖ్యలో జనం గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సావో సెబాస్టియావో పట్టణం నుండి టీవీ, సోషల్ మీడియా ఫుటేజీలు వరదలతో నిండిన రహదారులు, కార్లు పడిపోయిన చెట్లను చూపించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Brinjal Benefits: నచ్చలేదని వంకాయకు వంకపెట్టారో.. మీరు అన్నీ మిస్సయినట్లే
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
సావో పాలో నగరానికి ఉత్తరాన ఉన్న తీర ప్రాంతంలో మరో 228 మంది నిరాశ్రయులవగా, 338 మందిని ఖాళీ చేయించారు. తుఫాను బారిన పడిన వారికి సహాయం చేయడానికి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ వాతావరణం కారణంగా దెబ్బతిన్న తీరం వెంబడి ఉన్న ఐదు పట్టణాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అతను రెస్క్యూ ఆపరేషన్ల కోసం 1.5 మిలియన్ డాలర్ల నగదును కేటాయించారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.
Read Also:Vishnu Kumar Raju: కన్నాను కలిసిన విష్ణుకుమార్ రాజు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు
మట్టి గుట్టల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి. వరదల వల్ల అనేక నగరాల్లో కార్నివాల్ వేడుకల్ని రద్దు చేశారు. సావో సెబాస్టియోలో గత 24 గంటల్లో 627 మిమీటర్ల వర్షం కురిసింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆ నగర మేయర్ తెలిపారు. 50 ఇండ్లకుపైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు చెప్పారు. సాంటోస్ నగరంలో ఉన్న పోర్టును మూసివేశారు. బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో పోర్టును బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు ఉండనున్నట్లు వెదర్ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!