Site icon NTV Telugu

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Cec

Cec

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ్యాయి. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, రెబెల్స్ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు.

Read Also: Amit Shah Video: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు.. అమిత్ షా వీడియోపై విచారణ..

నూజివీడులో టీడీపీ రెబెల్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ ఉప సంహరించుకున్నారు.అనకాపల్లి జిల్లా మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. వాస్తవానికి పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది.. కానీ అనూహ్య పరిణామాలతో చివరి నిమిషంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టికెట్ కేటాయించారు. దీంతో పైలా ప్రసాద్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారారు.. పోటీలో ఉంటానని ప్రకటించారు. కానీ ఆయన నామినేషన్ విషయంలో వెనక్కు తగ్గారు.. నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు.

Read Also: CM YS Jagan: ఏపీలో హీరో ఎవరో.. విలన్‌ ఎవరో.. ప్రజలు తెలుసుకోవాలి..

మడకశిరలో టీడీపీ రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మడకశిర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజును అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలోనే మనస్తాపంతో సునీల్ కుమార్‌ నామినేషన్‌ వేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారారు.. పోటీలో ఉంటానని ప్రకటించారు. కానీ ఆయన నామినేషన్ విషయంలో వెనక్కు తగ్గారు.. నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీ రెబల్ అభ్యర్థి తిరివీధి జయరాములు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. గతంలో బీజేపీ టిక్కెట్ దక్కలేదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా జయరాములు నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ఇరవై మూడు నామినేషన్లకు గాను ఎనిమిది మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల బరిలో 15 మంది ఉన్నారు. ఇంకా చాలా మంది రెబల్ అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఎంత మంది ఉపసంహరించుకున్నారో కాసేపట్లో తెలియనుంది.

Exit mobile version