Site icon NTV Telugu

Rajyasabha Elections: ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు

Rajyasabha

Rajyasabha

Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. .. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే, ఏపీలోని రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.. మూడు సీట్లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి ముగ్గురు నామినేషన్ల దాఖలు చేశారు.. రెండు సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ్ రెడ్డి, గొల్ల బాబూరావు.. అయితే, రాజ్యసభ రేసుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. దీంతో, వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.. ఏకగ్రీవం లాంఛనమే కాగా.. నామినేషన్ల పరిశీలన ,ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వైసీపీ ముగ్గురు అభ్యర్థులు ఎన్నిక అయినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించనునుంది.

Read Also: BJP: ఏడుగురు కేంద్రమంత్రుల్ని నామినేట్ చేయని బీజేపీ.. కారణం ఇదేనా..?

కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా బరిలోకి దిగి.. తమ అభ్యర్థిని గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ.. దీంతో, రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో టీడీపీ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటుంది అనే చర్చ జోరుగా సాగింది.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు.. సీట్లు దక్కని సిట్టింగులు, మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారని.. ఇది క్యాష్ చేసుకోవడానికి టీడీపీ తన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ప్రచారం సాగింది. కానీ, బలం లేకపోవడంతో బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది టీడీపీ.. పార్టీ సీనియర్ల సమావేశంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, రేసు నుంచి టీడీపీ తప్పుకోవడంతో మూడు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైపోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తోన్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ.. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తరువాత ఈ ఇద్దరికి అవకాశం కల్పించినట్టు పీసీసీ చెబుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version