NTV Telugu Site icon

AIIMS: చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుంది..! ఎయిమ్స్ పరిశోధనలో వెల్లడి

Aiims

Aiims

ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.

Read Also: Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం

భోపాల్‌లోని ఎయిమ్స్(AIIMS) లో ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాఘవేంద్ర కుమార్ విదువా అతని బృందం పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్‌పై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో పోస్టుమార్టం అనంతరం 125 మంది మృతదేహాల నుంచి స్పెర్మ్‌లను సేకరించి భద్రపరిచారు. ఇందులో 47.22 శాతం మంది స్పెర్మ్ సజీవంగా ఉన్నట్లు తేలింది. దేశంలోనే తొలిసారిగా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చనిపోయిన వ్యక్తులపై ఈ తరహా పరిశోధనలు చేశామని డాక్టర్ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. ఈ పరిశోధన గురించి గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగిన 26వ ట్రైనియల్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ మెడిసిన్ కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

Read Also: Teamindia: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు భారత మహిళల జట్టులను ప్రకటించిన బీసీసీఐ..

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో ఈ పరిశోధన 2022లో ప్రారంభించబడిందని, ఇందులో ప్రత్యేకంగా 47.22 శాతం కేసుల్లో లైవ్ స్పెర్మ్‌ని పొందామని.. వీటిని IVF ప్రక్రియలో ఉపయోగించవచ్చని డాక్టర్ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. ఈ కొత్త పద్ధతికి సంబంధించిన పేటెంట్ కోసం ఐసీఎంఆర్‌కు దరఖాస్తు పంపామని.. త్వరలోనే పేటెంట్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.