NTV Telugu Site icon

Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

నిందితులుగా భావిస్తున్న సుధీర్ వర్మ ఎప్పుడూ మొహానికి మాస్క్ పెట్టుకుని సంచరించేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆటో డ్రైవర్‌కు పార్సెల్ అందించిన మహిళ ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పిప్పర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెరుకువాడ సతీష్‌కి సాగిపాడు వద్ద మాస్క్ కట్టుకుని వచ్చిన మహిళ చెక్కపెట్టేతో ఉన్న పార్సెల్ అందించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

పార్సిల్ లో వచ్చిన డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేసిన ప్రత్యేక వైద్య బృందం అది హత్యగా నిర్ధారించారు. ఐతే మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. మృతుడి వివరాలు తెలిస్తే.. చెప్పాలంటూ పోలీసుల ప్రకటన కూడా విడుదల చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ అశోక్ కుమార్ విచారణపై సమీక్షించారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అన్నారు.

Also Read: AP Rains: 4 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ!

ఈ నెల 19న యండగండిలో సాగి తులసి అనే మహిళకు అందిన పార్సెల్లో మృతదేహం చూసి.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పార్సిల్ అందిన నాటి నుంచి కనిపించకుండా పోయిన సాగి తులసి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మల్లంపూడికి చెందిన తిరుమణ సుధీర్ వర్మకు మూడు పేర్లు ఉండగా.. ముగ్గురు భార్యలు ఉన్నారు. సుధీర్ వర్మగా మొదటి పెళ్లి. శ్రీధర్ వర్మగా రెండో పెళ్లి, సిద్ధార్థ వర్మగా మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రెండో భార్య రేవతి అక్క తులసీతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. అందుకే శ్రీధర్ వర్మను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Show comments