NTV Telugu Site icon

Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు.. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు!

Dead Body Chandigarh

Dead Body Chandigarh

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో కలకలం సృష్టించిన పార్సిల్‌లో డెడ్‌బాడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాగి తులసి వచ్చిన పార్సిల్‌లోని మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరంకు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాగి తులసి చెల్లెలి భర్త సుధీర్ వర్మనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్ వర్మ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్, మొబైల్స్ మార్చుతూ.. తప్పించుకు తిరుగుతున్న సుధీర్ వర్మ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరోవైపు మృతుడి స్వగ్రామానికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నెల 19న యండగండిలో సాగి తులసి అనే మహిళకు అందిన పార్సెల్లో మృతదేహం కనిపించింది. ఎలక్ట్రికల్‌ వస్తువులు వచ్చాయనుకొని చెక్క పెట్టెను తెరిచి చూడగా.. అందులో మృతదేహం కనిపించడంతో షాక్ అయింది. తులసి కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తులసి ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తులసికి మెసేజ్‌ పంపిన వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. పార్సిల్ అందిన నాటి నుంచి కనిపించకుండా పోయిన సాగి తులసి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్‌ పంపిన కారులోని మహిళ కోసం సైతం పోలీసులు గాలిస్తున్నారు.

Show comments