Site icon NTV Telugu

TSPSC: 80 మందికి ఏఈ పేపర్ అమ్మిన డీఈ రమేష్.. విచారణలో షాకింగ్ విషయాలు..!

Tspsc

Tspsc

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తీగ లాగితే DE రమేష్‌ లీక్స్ బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న రమేష్‌ లీలలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. AEE, DAO ఎగ్జామ్స్‌లో ఇన్విజిలేటర్స్‌ సాయంతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కి తెర లేపాడు.. దీంతో అతగాడి ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థుల జాబితాను సిట్‌ అధికారులు తయారు చేస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడ్డ పలువురిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. సిట్ విచారణలో డీఈ రమేష్ విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు.

Also Read : Naga babu : పవన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు…?

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక మలుపు.. డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల సురేష్‌ నుంచి ఏఈ పేపర్ తీసుకొచ్చిన డీఈ రమేష్.. పెద్దపల్లి, కరీంనగ్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలకు ఏఈ పేపర్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డీఈ రమేష్‌ను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రమేష్ విచారణతో మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది.

Also Read : Russia-Ukraine War: యుద్ధంలో 500మంది పిల్లలను చంపిన రష్యా

అయితే డీఈ రమేష్ తాను పనిచేసిన ఏరియాలోని అభ్యర్థులకు పేపర్ అమ్మినట్లు తెలుస్తుంది. మాస్ కాపీయింగ్ కి అవసరమైన మైక్రో రిసీవర్స్‌, మైక్రో ఇయర్ బగ్స్‌ ఆన్‌లైన్‌లో కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం సేకరించిన డివైజెస్‌తో పలుసార్లు డెమో నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాక.. రమేష్‌ అతని బంధువు పూల సురేష్.. అభ్యర్ధుల కోసం‌ సెర్చ్‌ చేశారు. సిటీలోని కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న కేండిడేట్స్‌తో కాంటాక్ట్‌ అయ్యారు. ఇందులో AEE, DAO పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులను గుర్తించారు. వాళ్లతో మాట్లాడి డీల్‌ సెట్‌ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు అని సిట్ అధికారులు గుర్తించారు.

Exit mobile version