NTV Telugu Site icon

DCP Koti Reddy : యువత డ్రగ్స్ కు బానిస కావద్దు

Dcp Kotireddy

Dcp Kotireddy

యువత డ్రగ్స్ కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ముందుకు వెళ్లాలని మేడ్చల్ డిసిపి యువతకు పిలుపు నిచ్చారు.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసు లో భాగంగా ఈ ‌రోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధి గా మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి హాజరయ్యారు.. ఈ పోటీలలో మెత్తం 8 ఎనిమిది టీం లు పాల్గొనగా వాటిలో నవ భారత్ యువసేన ,జీడిమెట్ల గ్రామ యువకులు ప్రధమ స్దానం లో నిలిచి గెలుపొందారు.. గెలిచిన టీంలకు మెమొంటోలను ఆయన అందచేశారు.. యువత చెడుఅలవాట్లకు దూరంగా ఉండాలని క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి అన్నారు. పేట్ బషీరాబాద్ పి.యస్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు శుక్రవారం క్రికెట్ పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీముకు డిసీపీ కోటిరెడ్డి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమంలో పేట్ బషరాబాద్ సీఐ.విజయ వర్ధన్ ఎస్సైలు ప్రవీణ్ కుమార్ ధర్మేష్ సురేందర్ రెడ్డి పోలీస్ బృందం యువకులు పాల్గొన్నారు.

MP Horror: 7 నెలల గర్భిణి అని చూడకుండా.. కట్నం కోసం నిప్పంటించి చంపారు..