NTV Telugu Site icon

DCP Giridhar : హైదరాబాదులో డెకాయ్ ఆపరేషన్… యాంటీ డెకాయిట్ టీమ్స్ రంగంలోకి

Dcp Giridhar

Dcp Giridhar

నగరంలో జరుగుతున్న వివిధ రకాల దొంగతనాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగానే నిన్న అర్ధ రాత్రి సికింద్రబాద్ లోని మెట్టుగూడ లో డెకాయ్ ఆపరేషన్ చేసి రోడ్డు పక్కన నిద్రించే వారినే టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లు దొంగిలించే ముఠాను అరెస్ట్ చేశారు.. ఈ డెకాయ్ ఆపరేషన్ పై పూర్తి సమాచారం తెలియజేస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో యాంటీ డెకొయిట్ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి నుంచి నగరవ్యాప్తంగా పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని, చిలకలగూడలో డెకాయ్ ఆపరేషన్ చేస్తుండగా పోలీసులపై అనుమానితులు తిరుగబడ్డారని పేర్కొన్నారు. దీంతో.. పోలీసులపై తిరగబడ్డ అనుమానితులను కంట్రోల్ చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. చిలకలగూడ ప్రాంతంలో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.

 

ఇదే కాకుండా.. ఆసిఫ్ నగర్‌లో కూడా గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. నేర నియంత్రణ చేయడానికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లు చేపట్టిందని డీసీపీ గిరిధర్ తెలిపారు. ఇప్పటి వరకు డెకాయ్ ఆపరేషన్లు చేసి ఎనిమిది గ్యాంగ్ లను అరెస్ట్ చేశామని, సికింద్రాబాద్ మెట్టుగూడాలో పోలీస్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. అక్కడ సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న నలుగురు ముఠాను అరెస్ట్ చేశామని, వారి గత నేర చరిత్ర పై విచారణ చేస్తున్నామని డీసీపీ గిరిధర్ వెల్లడించారు. మెట్టుగూడా లో జరిగిన డెకాయ్ ఆపరేషన్లో పోలీసులపై దాడికి చేయడానికి ప్రయత్నం చేశారని, వారిని అదుపు చేయడానికి మా సిబ్బంది గాల్లోకి రివాల్వర్ ఫైర్ చేశారన్నారు. కొంత మంది యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.