Site icon NTV Telugu

DC vs SRH: కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల.. ఎస్ఆర్హెచ్ ముందు స్వల్ప లక్ష్యం.!

Srh

Srh

DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (6), కేఎల్ రాహుల్ (10) కూడా నిలదొక్కుకోలేకపోయారు.

Read Also: Motorola Razr 60 Ultra: అబ్బురపరిచే ఫీచర్లతో ఫ్లిప్ ఫోన్.. భారత మార్కెట్‌‌లోకి తీసుకరాబోతున్న మోటోరోలా.!

ఇక ఢిల్లీకి గౌరవప్రద స్కోర్ అందించడంలో ట్రిస్టన్ స్టుబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41)లు ప్రధాన పాత్ర పోషించారు. ఇక చివర్లో విప్రజ్ నిగమ్ కూడా 18 పరుగులు చేసి కొంత మద్దతు ఇచ్చాడు. ఇక హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. జయదేవ్ ఉన్నాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ తలా ఒక వికెట్ తీసారు. దీనితో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలో దిగనుంది.

Exit mobile version