Site icon NTV Telugu

DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..

Ipl 2024

Ipl 2024

నేను ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్, మెక్‌గుర్క్ లు ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 20 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్స్ సహాయంతో 50 పరుగులు చేయగా.. మరో ఎండ్ లో ఉన్న అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో మూడు సిక్సర్లు ఏడు ఫోర్స్ సహాయంతో 65 పరుగులు జోడించాడు. ఆ తర్వాత చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ 200 పరుగులను దాటించింది.

also read: Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా..

ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, చాహల్ చెరువు వికెట్ను తీశారు. ఇక విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ 222 పరుగులు చేయాల్సి ఉంది.

Exit mobile version