ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలవడం ఆర్సీబీకి చాలా కీలకం. ఒకవేళ ఓడిపోతే.. ఆర్సీబీ ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ఢిల్లీ ఓడిపోతే మరో ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్లకు విజయం చాలా ముఖ్యం.
బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యశ్ దయాళ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.
ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుశాగ్రా, అక్షర్ పటేల్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాసిఖ్ సలామ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
