Site icon NTV Telugu

Murder : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం.. టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై హత్య

Crime 1

Crime 1

Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్‌లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని రక్తపు మడుగులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Ajay Devgn : యుద్ధమే పరిష్కారం అయినప్పుడు.. తప్పు లేదు

సమాచారం అందుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పగటిపూట, అది కూడా ఆసుపత్రి ఎదురుగా ఇలాంటి దారుణం జరగడం నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RAPO 22: ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ గ్లిమ్స్ అదిరింది

Exit mobile version