NTV Telugu Site icon

David Warner: నాకో ఆశయం ఉంది.. క్రికెట్‌ కెరీర్‌ తర్వాత..!

David Warner Test

David Warner Test

David Warner expresses ambition to take up coaching in future: తనకు ఓ ఆశయం ఉందని, క్రికెట్‌ కెరీర్‌ తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. ఐపీఎల్‌, పీఎస్ఎల్, సీపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లు పంచుకుంటుండటంతో.. వచ్చే పదేళ్లలో స్లెడ్జింగ్‌ పూర్తిగా దూరమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇకపై ప్లేయర్స్ స్లెడ్జింగ్‌ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని వార్నర్‌ పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేలకు వార్నర్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే టీ20ల్లో మాత్రం అతడు కొనసాగుతున్నాడు.

డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ… ‘నాకో ఆశయం ఉంది. క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. ఇందుకోసం ముందుగా నా భార్యతో మాట్లాడాలి. ఎందుకంటే.. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతి తీసుకోవాలి. ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి నేరుగా చూసేవాడిని. వారు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు లయను దెబ్బతీసేవాడిని. ఇకపై అలాంటి స్లెడ్జింగ్‌ చూస్తారని అనుకోవడం లేదు. వచ్చే 5-10 పదేళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్‌ కంటే మ్యాచ్ గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు’ అని అన్నాడు.

Also Read: IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్‌ ఓటమి!

పాకిస్తాన్‌పై తాజాగా డేవిడ్ వార్నర్‌ కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. వార్నర్ 112 టెస్టులో 8,786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 335 నాటౌట్. వన్డే క్రికెట్‌కు సైతం వార్నర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో చివరగా ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్‌.. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 179.