NTV Telugu Site icon

David Warner: ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ ఫైర్.. కారణమిదే..?

Warner

Warner

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు. ‘X’లో పైలెట్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి కూడా గంట ముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలెట్ లేని విమానంలో గంటపాటు ఎదురు చూడాలా..? అని పోస్ట్ చేశారు.

వార్నర్ వ్యాఖ్యలపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఆలస్యానికి కారణం.. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులే అని తెలిపింది. వాతావరణ సమస్యల కారణంగా అనేక విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాల మళ్లింపులు, ఆలస్యాలను ఎదుర్కొన్నాయని పేర్కొంది. ఈ కారణంగా ఆ విమానానికి కేటాయించిన సిబ్బంది మరో పనిలో బిజీగా ఉన్నారని.. ఇది మరింత ఆలస్యానికి దారితీసిందని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. అసౌకర్యానికి బాధితులైన వార్నర్, ఇతర ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2025లో ఆడటం లేదు. ఇటీవల జెడ్డాలో జరిగిన మెగా వేలంలో అతను అమ్ముడుపోలేదు. ఐపీఎల్‌లో అవకాశం లభించకపోయినప్పటికీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో కనిపించనున్నాడు. ఏప్రిల్ 11 నుండి మే 18 వరకు జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో కరాచీ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు.. సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో ‘రాబిన్ ఉడ్’ చిత్రంలో ఆయన నటించారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది