NTV Telugu Site icon

David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ వల్ల చాలా బాధను అనుభవించాను.. డేవిడ్ వార్నర్..

David Warner Srh

David Warner Srh

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమ్‌ను విడిచిపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేశారని, ఇది తనను చాలా బాధించిందని చెప్పాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా చాలా కాలం పాటు ఆడి, ఒక సీజన్ లో ట్రోఫీని గెలిపించినగాని.. తనకు ఈ అగౌరవం దక్కడం ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: RCB Fans: ఒక్క కప్ గెలవకపోయిన ఇంత క్రేజ్ ఏంటయ్యా.. డిగ్రీ పట్టా తీసుకుంటూ ఆర్సీబీ జెండా, జెర్సీతో పోజులు..

ఈ సంఘటన 2023లో జరిగింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్‌ని కొనుగోలు చేసిన తర్వాత, వార్నర్ అతనిని అభినందించడానికి సోషల్ మీడియాకు వెళ్లాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన ఖాతాను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేసిందని తెలిసి వార్నర్ షాక్ అయ్యాడు. ఆ సమయంలో సన్ రైజర్స్ తనను బ్లాక్ చేసిందని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా, అశ్విన్‌తో జరిగిన చాట్ షోలో వార్నర్ దీని గురించి మాట్లాడాడు.

Also Read: 2024 ICC Women’s T20 World Cup: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్, పాక్ మ్యాచ్ అప్పుడే..

సన్‌రైజర్స్ బ్లాక్ చేయడం అనేది తనకి చాలా బాధాకరమైనది., ఎందుకంటే.. ఆటగాళ్లకు సన్‌రైజర్స్ అభిమానులతో ప్రత్యేక బంధం ఉందని నేను భావిస్తున్నాను. కానీ హైదరాబాద్ నన్ను ఎందుకు బ్లాక్ చేసిందో నాకు తెలియదు అంటూ అసలు విషయాన్ని తెలిపాడు.