David Miller: డ్రెస్సింగ్ రూమ్ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Miller: డేవిడ్ మిల్లర్ ఒక స్టార్ ప్లేయర్. బ్యాట్ పట్టి స్టేడియంలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు బెదిరిపోతారు. అలాంటి విధ్వంసరక బ్యాట్స్‌మెన్ ఓ చిన్న తప్పు చేశాడు. ఈ తప్పు కాస్త తన టీమ్ ఒటమికి కారణమైంది. క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. అప్పటి వరకు ఢిల్లీ ఫ్యాన్స్‌కు డేవిడ్ మిల్లర్ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానం ఒక్కసారిగా కోపానికి దారి తీసింది. నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రెండు బాల్స్‌లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా మిల్లర్ చిన్న తప్పు చేశాడు. దీంతో ఒకే పరుగు తేడాతో గుజరాత్‌కు విజయం వరించింది. అయితే.. తాను చేసిన తప్పుకు గ్రౌండ్‌లోనే డేవిడ్ మిల్లర్ ఎంతో కుమిలిపోయాడు. కన్నీరు సైతం పెట్టుకున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన ఆఫీసియల్ ఎక్స్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పంచుకుంది.
READ MORE: Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
మ్యాచ్ అనంతరం ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం జట్టును ఓడించిందన్న బాధలో ఉన్న మిల్లర్‌ను కోచ్ హేమంగ్ బదానీ ఓదార్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విజయంతో టైటాన్స్ తమ మూడో ప్రయత్నంలో పాయింట్ల ఖాతా తెరువగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుని నిరాశలో మునిగిపోయింది.
READ MORE: Babar Azam: “విరాట్ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్
అసలు ఏం జరిగింది?
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 210 పరుగులు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు అవసరమయ్యాయి. వేలి గాయంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన మిల్లర్ (41 నాటౌట్) తిరిగి క్రీజులోకి రావడంతో ఢిల్లీ ఆశలు చిగురించాయి. మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 23 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా, గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బంతిని అందుకున్నాడు. చివరి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో మిల్లర్ ఒక భారీ సిక్సర్ బాదాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. అయితే, ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా, అవతలి ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం లేక మిల్లర్ ఆ పరుగును నిరాకరించాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. ప్రసిద్ధ్ కృష్ణ తెలివిగా వేసిన స్లో బౌన్సర్‌ను మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. బైస్ రూపంలో పరుగు తీసేందుకు ప్రయత్నించగా, వికెట్ కీపర్ జోస్ బట్లర్ అప్రమత్తంగా వ్యవహరించి కుల్దీప్‌ను రనౌట్ చేశాడు. వైడ్ కోసం రివ్యూ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఢిల్లీ 209 పరుగుల వద్దే ఆగిపోయి, కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH
— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!