Site icon NTV Telugu

Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

Dasun Shanaka Ipl 226

Dasun Shanaka Ipl 226

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు మరో భారీ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం పీఎస్ఎల్ నుంచి ఇప్పటికే కొందరు ప్లేయర్స్ తప్పుకోగా.. తాజాగా ఈ లిస్టులో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా చేరినట్లు సమాచారం. పీఎస్ఎల్‌ 2026లో కాకుండా ఐపీఎల్ 2026లో ఆడాలని షనక నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక కెప్టెన్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

2026 పీఎస్ఎల్ వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టు దసున్ షనకను పీకేఆర్ 2.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే శనక లీగ్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. మెగా లీగ్ ఐపీఎల్ క్రేజ్ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇతర లీగ్‌లను వదిలి.. ఐపీఎల్‌ ఆడేందుకు వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. శనక కూడా అదే దారిలో నడిచాడు. షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత టోర్నీల నుంచి తప్పుకునే ఆటగాళ్లపై 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం విధించడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని సూచిస్తున్నారు.

2026 మినీ వేలంలో శ్రీలంక ఆల్-రౌండర్ దాసున్ షనకను ఏ ప్రాంచైజీ కోనుగోలు చేయలేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఐపీఎల్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆడాడనికి పీఎస్ఎల్ నుండి వైదొలిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ లేదా గుజరాత్ టైటాన్స్‌కు షనక ఆడే అవకాశం ఉంది. సామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షనక స్టార్ ఆల్‌రౌండర్. 2022 ఆసియా కప్‌లో శ్రీలంకను ఛాంపియన్‌గా నిలిపాడు. లోయర్ ఆర్డర్‌లో వేగంగా ఆడగల సామర్థ్యం, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దూకుడు బ్యాటింగ్ అతడి ప్రత్యేకత. 90కి పైగా మ్యాచ్‌లు ఆడిన షనక 1300+ పరుగులు చేశాడు.

Exit mobile version