Site icon NTV Telugu

Dasara Twitter Review : నేచురల్ స్టార్ ఇరగదీశాడు.. దసరాపై ట్విట్టర్ రివ్యూ ఎంటంటే

Dasara Shooting

Dasara Shooting

టాలీవుడ్ లో చేరురల్ స్టార్ గా పెరుతెచ్చుకున్న నాని మాస్ లుక్ తో నటించిన మూవీ దసరా. భారీ అంచనాల నడుమ నేచురల్ స్టార్ నాని నటించిన దసర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం దసరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హింది బాషాల్లో విడుదలైంది. ఇప్పటి వరకు సాఫ్ట్ మూవీస్ చేసిన నాని.. ఈసారి రఫ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. రేగిన జుట్టు, మెలి తిప్పిన మీసాలతో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన దసరా..ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడిపోయాయి. దీంతో అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Also Read: Ambati Rambabu: చంద్రబాబు కోసం పవన్‌ కల్యాణ్‌ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..!

కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించిన దసరాకు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించారు. నాని కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో దీనిని తెరకెక్కించారు. 65 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సినిమాను చూసిన అభిమానులు, నాని ఇరగదీశాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్స్‌లో నాన్ స్టాప్ విజిల్స్ వేస్తున్నారు. నాని కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్ ఇదే. దసరా ముందు దసరా తర్వాత అనేంత గొప్పగా నటించాడు అంటూ చెబుతున్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కేవ్వు కేక అని, నాని బ్లాక్ బస్టర్ కొట్టేశాడని నెటిజన్లు ట్వీట్టు చేస్తున్నారు. పాటలు, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన దసరా సినిమా అదిరిపోయిందని.. నాని నటన కేక ఉందని.. కీర్తి కూడా ఇరగదీసిందని అంటున్నారు. మరికొందరు సినిమా కొద్దిగా ల్యాగ్ ఉందని అని కూడా అంటున్నారు. అయితే, శ్రీరామ నవమి సందర్భంగా వచ్చిన దరస సినిమా మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది.

Exit mobile version