Dussehra Lucky Draw: దసరాకు పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకునేందుకు పలు ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు లక్కీ డ్రా నిర్వహిస్తూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తాయి. అయితే ఓ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు. రూ.150 కూపన్ తీసుకుంటే పండుగకు ముందు లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేయాలని నిర్ణయించారు. ఇంతకీ అదిరిపోయే బహుమతులు ఏమిటి..? ఈ లక్కీ డ్రా ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలియాలంటే ఇది చూడండి..
READ MORE: OG : ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్
సాధారణంగా తెలంగాణలో దసరా అంటే మందు, మాంసం ఉండాల్సిందే! అందుకే తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఈసారి దసరా పండుగకు బంపర్ ఆఫర్లతో లక్కీ డ్రా స్కీంను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా చాలా కాలంగా నడుస్తున్న జానీ చికెన్ & మటన్ సెంటర్ లో కొత్త రకం లక్కీ డ్రా అందరినీ ఆకట్టుకుంటోంది. గిరాకీ తగ్గడంతో దుకాణం యజమాని నాగరాజు ఈ ఆలోచన చేశాడు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే 150 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డ్రా విజేతలకు కేటాయించిన బహుమతులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొదటి బహుమతిగా 15 కిలోల బరువున్న గొర్రెపోతు, బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్, రెండవ బహుమతిగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. విజేతలకు అందజేసే బహుమతులతో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. దసరా పండుగకు ముందురోజు అందరి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తామని యజమాని నాగరాజు చెబుతున్నారు. కేవలం వంద మందికి మాత్రమే అవకాశం కల్పించాడు. ఇప్పటికే అనుహ్య రీతిలో టికెట్లు కొనుగోలు చేశారని తెలిపాడు.
READ MORE: MLC Kumbha Ravibabu: నాలుగు సార్లు సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా..?