Site icon NTV Telugu

Dasara : టీవీ లో టెలికాస్ట్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ..?

Whatsapp Image 2023 09 13 At 7.46.16 Am

Whatsapp Image 2023 09 13 At 7.46.16 Am

ఈ ఏడాది స్టార్ హీరో నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. హీరో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్‌ కి పరిచయం అయ్యారు. ఇంతకు ముందు ఆయన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.శ్రీకాంత్ తెరకెక్కించిన దసరా మూవీ తెలంగాణలోని సింగరేణి ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. స్నేహం, ప్రేమ అంశాలతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. సింగరేణి ప్రాంతాన్ని రియలిస్టిక్‌గా ఆవిష్కరించిన తీరుకు ఆయనకీ ప్రశంసలు దక్కాయి.ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని, వెన్నెలగా కీర్తిసురేష్ తమ అద్భుత నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. తన స్నేహితుడి మరణానికి కారణమైన ఊరిపెద్దపై ఓ సామాన్య యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఏ విధంగా అండగా నిలిచాడు అన్నదే ఈ సినిమా కథ.

పాన్ ఇండియన్ లెవెల్‌లో దసరా రిలీజై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దసరా సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.ఇదిలా ఉంటే, థియేటర్స్ లో అలాగే ఓటీటీ లో అదరగొట్టిన నాని దసరా మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్‌ టీవీ ప్రీమియర్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రివీలైంది.జెమిని టీవీ ద్వారా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను దసరా మూవీ పలకరించబోతున్నట్లు సమాచారం.త్వరలోనే దసరా వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ డేట్‌ను ప్రకటిస్తామని జెమిని టీవీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 19న ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.దసరా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ దాదాపు 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Exit mobile version