Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
- డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా
- ఓటమిని తట్టుకోలేకపోయిన రాకెట్‌ను విరగొట్టిన మెద్వెదేవ్
- ప్రేక్షకులతో మెద్వెదేవ్ అనుచిత ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా పడింది. యూఎస్ ఓపెన్ 2025లోని తొలి రౌండ్‌లోనే ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్ తన రాకెట్‌ను కోర్టులోనే విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనల కారణంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులు అతడికి 42,500 యూస్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు) జరిమానాను విధించారు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు పైగా కావడం గమనార్హం.
డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో ఓడిపోయాడు. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్ అసహనం, ఆవేశంలో తన రాకెట్‌ను విరగ్గొట్టాడు. తాను కూర్చున్న చోటే.. రాకెట్‌ను కుర్చీకేసి పలుమార్లు కొట్టాడు. దాంతో రాకెట్ విరిగిపోయింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు మొదటి రెండు సెట్లను కోల్పోయిన మెద్వెదెవ్ ఆపై పుంజుకున్నాడు. మూడో సెట్ పాయింట్‌కు సమీపంలో ఉండగా ఓ ఫొటోగ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించాడు. ఆరు నిమిషాల పాటు ఆటను అంపైర్లు నిలిపివేశాక.. బోంజికి మళ్లీ సర్వీస్ ఇస్తూ ఛైర్ అంపైర్ గ్రెగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో మెద్వెదెవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. మెద్వెదెవ్ కూడా అందుకు ప్రతిస్పందనగా అరిచాడు. సెట్ అనంతరం అసభ్య సైగలతో మెద్వెదెవ్ ప్రవర్తించాడు.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Russian tennis player Daniil Medvedev exhibited classic Russian culture after a loss at the US Open – violence and mental illness.
Send this psycho back to Russia and ban him from the sport. pic.twitter.com/Y4FzTOp4ia— Igor Sushko (@igorsushko) August 25, 2025
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!