Site icon NTV Telugu

Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!

Daniil Medvedev Fine

Daniil Medvedev Fine

రష్యా ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా పడింది. యూఎస్ ఓపెన్‌ 2025లోని తొలి రౌండ్‌లోనే ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్‌ తన రాకెట్‌ను కోర్టులోనే విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనల కారణంగా యూఎస్ ఓపెన్‌ నిర్వాహకులు అతడికి 42,500 యూస్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు) జరిమానాను విధించారు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు పైగా కావడం గమనార్హం.

డానిల్‌ మెద్వెదెవ్‌ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ ప్లేయర్ బెంజమిన్‌ బోంజి చేతిలో 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో ఓడిపోయాడు. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్‌ అసహనం, ఆవేశంలో తన రాకెట్‌ను విరగ్గొట్టాడు. తాను కూర్చున్న చోటే.. రాకెట్‌ను కుర్చీకేసి పలుమార్లు కొట్టాడు. దాంతో రాకెట్‌ విరిగిపోయింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు మొదటి రెండు సెట్లను కోల్పోయిన మెద్వెదెవ్‌ ఆపై పుంజుకున్నాడు. మూడో సెట్‌ పాయింట్‌కు సమీపంలో ఉండగా ఓ ఫొటోగ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించాడు. ఆరు నిమిషాల పాటు ఆటను అంపైర్లు నిలిపివేశాక.. బోంజికి మళ్లీ సర్వీస్‌ ఇస్తూ ఛైర్‌ అంపైర్‌ గ్రెగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో మెద్వెదెవ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. మెద్వెదెవ్‌ కూడా అందుకు ప్రతిస్పందనగా అరిచాడు. సెట్‌ అనంతరం అసభ్య సైగలతో మెద్వెదెవ్‌ ప్రవర్తించాడు.

Exit mobile version