Site icon NTV Telugu

MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా 20 మంది కాంగ్రెస్ లోకి.. దానం కీలక వ్యాఖ్యలు..

Mla Danam Nagender

Mla Danam Nagender

MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయన్నారు. పోచారంతో సీఎం భేటీ పై దానం స్పందిస్తూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని వెల్లడించారు.

Read also: Pocharam Srinivas Reddy: నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైంది..

కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని తెలిపారు. పల్లా, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని అన్నారు. ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు.
Air India Airlines : టాటా ఎయిర్‌లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన

Exit mobile version