Site icon NTV Telugu

Damodara Raja Narsimha : గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసింది

Raja Narsimha

Raja Narsimha

మెదక్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యవస్థ అనేది శాశ్వతం… వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో ఇల్లు దిక్కులేదు..జాగా దిక్కులేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందన్నారు. ఇచ్చిన గ్యారెంటిలను రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అందజేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక విజన్‌ ఉందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ పాలనను ప్రజలకు అందించామని వివరించారు. రాజకీయం శాశ్వతం కాదని వ్యవస్థ ముఖ్యమని అన్నారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో మోడల్ స్కూల్స్, కేజీబీవీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Exit mobile version