NTV Telugu Site icon

Damodara Raja Narasimha : కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై సీబీఐ కేసును వేగవంతం చేయాలి

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేయాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉస్మానియా , గాంధీ ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆస్పత్రుల సూపరిoటెoడెంట్ లతో డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్ల, వైద్య సిబ్బంది కి భద్రత కల్పించాలనీ ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రత పై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు.

Vizianagaram SP: వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య..

ఇలాంటి, సంఘటనలు పునరావృతం కాకుండా డాక్టర్లు, నర్సుల, వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది యొక్క భద్రత, సంరక్షణ కు సంబంధించిన అంశాలను పొందుపరిచాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళల రక్షణ, భద్రత పై ఇప్పటికే ‘షీ టీమ్స్’ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయన్నారు.

Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్‌ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్‌

తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళ డాక్టర్ల భద్రత కు తీసుకోవాల్సిన అంశాల పై కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. కోల్కత్తాలో జరిగిన వైద్యురాలి అత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.